Gali Janardhana Reddy : 12 ఏళ్ల‌యినా ‘గాలి’పై జ‌ర‌గ‌ని విచార‌ణ

జ‌నార్ద‌న్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు

Gali Janardhana Reddy : గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఈ పేరు దేశంలో తెలియ‌ని వారంటూ ఉండ‌రు. ప్ర‌స్తుతం కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కుడు. గ‌నుల వ్యాపారి.

ఆయ‌న‌కు అన్ని పార్టీల నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో కింగ్ మేక‌ర్ గా పేరొందారు. మొత్తంగా గ‌నుల వ్యాపారంతో కోట్లు కొల్ల‌గొట్టాడు.

గ‌నుల అక్ర‌మ త‌వ్వ‌కాల్లో గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై(Gali Janardhana Reddy) సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగడం లేదు. ఆ కేసు న‌మోదు చేసి 12 ఏళ్లు పూర్తి కావ‌డం విశేషం.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు, వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను టార్గెట్ చేశాయి. కానీ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గాలి జ‌నార్దన్ రెడ్డి లాంటి వారిని ఎందుకు వ‌దిలి వేస్తుంద‌న్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

ఇందుకు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం (Supreme Court) సీరియ‌స్ గా స్పందించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

అస‌లు దేశంలో ద‌ర్యాప్తు సంస్థ‌లు ఏం చేస్తున్నాయంటూ ప్ర‌శ్నించింది. ఒక కేసును డీల్ చేసేందుకు 12 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుందా అని నిల‌దీసింది సీబీఐని.

ఇన్నేళ్ల‌యినా ఎందుకుని విచార‌ణ(Gali Janardhana Reddy Case) జ‌ర‌ప‌లేద‌ని మండిప‌డింది. ఒక ర‌కంగా చెప్పాలంటే న్యాయాన్ని అప‌హాస్యం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని వ్యాఖ్యానించారు జ‌స్టిస్ ఎంఆర్ షా, జ‌స్టిస్ కృష్ణ మురారితో కూడిన ధ‌ర్మాస‌నం.

ఇందుకు సంబంధించి గాలి పై న‌మోదు చేసిన కేసుల వివ‌రాలు, వాటికి సంబంధించిన విచార‌ణ ఏ ద‌శ‌లో ఉందో, ఎందుక‌ని ఇంత ఆల‌స్యం చేశారో కూడా వివ‌రాల‌తో నివేదిక‌ను ఈనెల 19 లోపు సీల్డ్ క‌వ‌ర్ లో అంద‌జే యాల‌ని సెష‌న్స్ జ‌డ్జిని ఆదేశించింది.

త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 20కి వాయిదా వేసింది.

Also Read : అవినీతి కేసులో యెడ్డీపై విచార‌ణ‌కు ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!