Ghulam Nabi Azad : ఆజాద్ కు ఉగ్రవాద సంస్థ వార్నింగ్
తుపాకులు వీడాలన్న మాజీ సీఎం
Ghulam Nabi Azad : మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులు తుపాకులు వీడాలని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బహిరంగ సభలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్దరించ లేమంటూ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.
గులాం నబీ ఆజాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా ఉగ్రవాద సంస్థ సీరియస్ గా స్పందించింది. ఆయనను చంపుతామంటూ వార్నింగ్ ఇచ్చింది.
గులాం నబీ ఆజాద్ భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చేలా చేస్తున్నారంటూ ఆరోపించింది. ఆయనను ద్రోహిగా అభివర్ణించింది. మోదీ , అమిత్ షా, జేపీ నడ్డా వ్యూహంలో భాగంగానే పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడింది సదరు సంస్థ.
ఇదిలా ఉండగా తను పార్టీ ప్రకటించే కంటే ముందు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగడం, హత్యలకు పాల్పడడం, కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. తుపాకుల వల్ల రాజ్యం సిద్దించదని, చంపడం పరిష్కారం చూపదన్నారు గులాం నబీ ఆజాద్.
దీనిపై ఉగ్రవాదులు మండిపడుతున్నారు. నిన్నటి దాకా పదవులను అనుభవించి బీజేపీకి ఊడిగం చేసేందుకు కొత్త రాగం అందుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆజాద్ కు భద్రతను మరింత పెంచారు.
Also Read : లక్నోలో భారీ వర్షం 9 మంది దుర్మరణం