Churchill Alemao : కాంగ్రెస్ రెబ‌ల్స్ చేరిక‌లో మాజీ సీఎం పాత్ర‌

బీజేపీలోకి వెళ్లేలా చ‌ర్చిల్ అలెమావో ట్రై

Churchill Alemao : గోవా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాదాపు ఖాళీ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. 11 మంది ఎమ్మెల్యేల‌కు గాను ఎనిమిది ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యారు.

పార్టీకి సంబంధించి వారంతా జంప్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాజీ సీఎం చ‌ర్చిల్ అలెమావో(Churchill Alemao) ద‌గ్గ‌రుండి చక్రం తిప్పిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

బీజేపీలోకి ఫిరాయించేందుకు, అవ‌స‌ర‌మైన సంఖ్య‌ను ఆ పార్టీ పొందేందుకు ఇతోధికంగా సాయం చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా ఉండేలా ప్రీ ప్లాన్ చేశార‌ని దీని వెనుక ఆయ‌న హ‌స్తం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది.

ఇదే స‌మ‌యంలో చ‌ర్చిల్ అలెమావో రొడాల్ఫో ఫెర్నాండేజ్ ను రెబ‌ల్స్ లో చేర‌మ‌ని ఒప్పించడంలో కీల‌క పాత్ర పోషించాడు.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఫిరాయించేందుకు అవ‌స‌ర‌మైన సంఖ్య‌లో వారంతా ఒక్క‌రేన‌ని ఒప్పించ‌డం ద్వారా అన‌ర్హ‌త ప్ర‌క్రియ‌ను ఆక‌ర్షించ‌లేదు.

అలెమావో(Churchill Alemao) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆల్టోన్ డికోస్టా , ఫెర్నాండేజ్ ల‌ను సంప్ర‌దించి వారిలో క‌నీసం ఒక్క‌రైనా ప‌క్క‌కు త‌ప్పుకునేలా స‌క్సెస్ అయ్యాడ‌ని ఆరోపణ‌లు ఉన్నాయి.

అత‌ను డికోస్తాను సంద‌ర్శించి ప్లాన్ గురించి చెప్పాడు. ఒక‌వేళ ఒప్పుకోడు అనుకున్న త‌రుణంలో ఆ ప్లాన్ ను ఫెర్నాండేజ్ కు వివ‌రించారు.

ఇద్ద‌రికీ ఒక‌రు తెలియ‌కుండా మ‌రొక‌రు బీజేపీలో వెళ్లుతున్న‌ట్లు సీన్ క్రియేట్ చేయ‌డంలో విజ‌యం సాధించాడు చ‌ర్చిల్ అలెమావో.
డికోస్టా త‌న‌ను ఆఫ‌ర్ల‌తో సంప్ర‌దించిన‌ట్లు అంగీక‌రించాడు.

కానీ పాల్గొన్న వారి పేరు చెప్పేందుకు నిరాక‌రించాడు. వెళ్లాల‌ని అనుకున్న వాళ్లు వెళ్లి ప ఓయారు. కానీ నేను నా సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు.

Also Read : మోదీ వ‌ల్ల ల‌క్ష జాబ్స్ కోల్పోయాం

Leave A Reply

Your Email Id will not be published!