Kamal Nath : బీజేపీలో చేరాల‌నుకునే వారిని అడ్డుకోం

కావాలంటే కారును అప్పుగా ఇస్తాం

Kamal Nath :  మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవ‌రినీ ఎక్కువ కాలం ఉండాల‌ని కోర‌బోమ‌న్నారు. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. రాష్ట్రంలో త‌మ పార్టీకి వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీకి విధేయ‌త చూపాల‌ని అనుకునే వారిని శాంతింప చేయ‌డంపై త‌న‌కు ఏ మాత్రం న‌మ్మ‌కం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం క‌మ‌ల్ నాథ్ మీడియాతో మాట్లాడారు.

ఒక వేళ చేరాల‌ని అనుకుంటే తాము ఎట్టి ప‌రిస్థితుల్లో అడ్డుకోబోమంటూ ప్ర‌క‌టించారు. అలాంటి వారికి తన కారును కూడా అప్పుగా ఇస్తాన‌ని ఎద్దేవా చేశారు క‌మ‌ల్ నాథ్(Kamal Nath).

ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో బీజేపీకి చేరిన కాంగ్రెస్ నాయ‌కుల సుదీర్గ జాబితాలో గ‌త వారం ఎనిమిది మంది గోవా కు చెందిన ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.

పార్టీని కోలుకోలేని షాక్ కు గురి చేసింది ఈ ఘ‌ట‌న‌. త‌మ వారిని కాపాడు కోవ‌డంలో పార్టీ వైఫ‌ల్యం చెందింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు క‌మ‌ల్ నాథ్.

గోవాలో చోటు చేసుకున్న సీన్ మ‌ధ్య ప్ర‌దేశ్ లో కూడా రిపీట్ కావ‌చ్చ‌న్న దానిపై ఆయ‌న స్పందించారు. వెళ్లాల‌ని అనుకునే వాళ్లు నిర‌భ్యంత‌రంగా పార్టీని వీడ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

ఒక‌వేళ వెళ్లే వారికి కారు కూడా అరెంజ్ చేస్తానంటూ తెలిపారు క‌మ‌ల్ నాథ్(Kamal Nath). ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల మాజీ సీఎం గులాం న‌బీ ఆజాద్ గుడ్ బై చెప్పారు.

ఆయ‌న రాహుల్ గాంధీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్ స‌న్నిహితుడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే అరుణోద‌య్ చౌబే పార్టీని వీడారు.

Also Read : నెట్టింట్లో న‌రేంద్ర మోదీ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!