DK Shivakumar : ఈడీ ముందు హాజరైన డీకే శివకుమార్
కేసు గురించి నాకు తెలియదని కామెంట్
DK Shivakumar : కర్ణాటకలో రాజకీయం మరింత వేడెక్కింది. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ , ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన ఈడీ ఆఫీసు ముందు విచారణకు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా గత వారం డీకే శివకుమార్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అయితే కేసు విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్.
60 ఏళ్ల వయస్సు కలిగిన డీకే శివకుమార్ ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ లోని ఫెడరల్ ఏజెన్సీ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు.
ఫ్రంట్ ఆఫీసు నుండి పాస్ చేసిన తర్వాత ఆఫీసులోకి నేరుగా వెళ్లి పోయారు. ఆయన వెంట కొంత మంది నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్(DK Shivakumar) జాతీయ మీడియాతో మాట్లాడారు.
సమన్లు ఈడీ ఇచ్చింది. కానీ దేని కోసం ఎందు కోసమని సమన్లలో పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపు ధోరణితో సాగుతున్న ప్రక్రియగా ఆయన అభివర్ణించారు.
తాను రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉంది. మరో వైపు అసెంబ్లీ సమావేశాలలో పలు సమస్యలను ప్రస్తావించాల్సి ఉంది.
కానీ సర్కార్ కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
Also Read : జీసీఈఏ ఫోరమ్ కు జితేంద్ర సింగ్