Onam Bumper Lottery : లాటరీలో ఆటో డ్రైవర్ కు జాక్ పాట్
ఒక్కసారే ధనవంతుడైన ఆటో డ్రైవర్
Onam Bumper Lottery : కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్ రాత్రికి రాత్రే కరోడ్ పతి అయ్యారు. తిరువనంతపురంలోని శ్రీవరహానికి చెందిన వ్యక్తి . ఎలా అయ్యాడంటే లాటరీ టికెట్లపై కేరళ ప్రజలకు అపురూపమైన క్రేజ్ ఉంది.
లాటరీలపై కేరళ వాసులకు ఎక్కువ ఆసక్తి ఉంది. అనూప్ అనే ఆటో డ్రైవర్ కు ఈ ఏడాది ఓనం బంపర్ లాటరీ(Onam Bumper Lottery) వచ్చింది. అనూప్ భగవతి ఏజెన్సీ నుంచి టికెట్ కొనుగోలు చేశాడు.
ఈ ఏడాది సూపర్ రిచ్ గా మారాడు. అంతకు ముందు ఓ హోటల్ లో చెఫ్ గా పని చేశాడు. అతడు మలేఇయా వెళ్లి చెఫ్ గా పని చేయాలని అనుకున్నాడు.
ఒక బ్యాంకు నుండి రుణం పొందాడు. కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాల గోపాల్ , రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు , వట్టి యూర్కపు ఎమ్మెల్యే వీకే ప్రశాంత్ సమక్షంలో లక్కీ డ్రా వేశారు.
టిజీ-750605 టికెట్ ను డ్రా నుంచి తీశారు. తీరా చూస్తే అతడికి లాటరీలో భారీ డబ్బులు వచ్చినట్లు తేలింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 15 కోట్ల 75 లక్షల రూపాయలు.
ఈ ఏడాది మొత్తం 67 లక్షల ఓనం బంపర్ టికెట్లను ముద్రించారు. టికెట్ ధర రూ. 500 మాత్రమే. ప్రజలు లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తారు. ఇది గత కొంత కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది.
కేరళ ప్రభుత్వానికి ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదిలా ఉండగా టికెట్ విక్రయించిన లాటరీ ఏజెంట్ థంకరాజ్ కు కూడా కమీషన్ వస్తుంది.
ఈ ఏడాది ఓనం బంపర్ ధర రూ. 25 కోట్ల రూపాయలు(Onam Bumper Lottery). రెండవ బహుమతి కింద రూ. 5 కోట్లు, మూడవ బహుమతి కింద 10 మందికి ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున అందజేస్తారు. కేరళ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక ప్రైజ్ మనీ కావడం విశేషం.
Also Read : మా డైమండ్ మాకివ్వండి – సౌతాఫ్రికా
30 year old Auto driver Anoop celebrates on winning the Kerala govt Onam bumper lottery jackpot in Trivandrum. Jackpot amount is a whooping 25 Crore ₹. pic.twitter.com/Ygaf9jHkGM
— Tashi Tobgyal (@tashitobgyal) September 18, 2022