MP Kirron Kher : వీడియోల లీక్ ఘటన బాధాకరం
ఎంపీ కిరన్ ఖేర్ తీరని ఆవేదన
MP Kirron Kher : పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీ హాస్టల్ లో వీడియోలు లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితురాలితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
సమగ్ర విచారణకు ఆదేశించారు పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్. ఈనెల 24 వరకు యూనివర్శిటీ కార్యకలాపాలు పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్లు వీసీ ప్రకటించారు.
మరో వైపు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థినులు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగారు. ఎంత చెప్పినా వినక పోవడంతో చివరకు గత్యంతరం లేక యూనివర్శిటీని మూసి వేస్తున్నట్లు తెలిపారు వీసీ.
ఇదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా చండీగఢ్ యూనివర్శిటీ హాస్టల్ నుంచి అభ్యంతరకరమైన వీడియోలు లీక్ ఘటనపై స్పందించారు స్థానిక ఎంపీ కిరెన్ ఖేర్(MP Kirron Kher).
ఈ ఘటన తనను ఎంతగానో బాధకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
గత కొన్నేళ్లుగా చండీగఢ్ నగరానికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని, కానీ యూనివర్శిటీ లో చోటు చేసుకున్న ఈ ఒక్క ఘటనతో పూర్తిగా చెడ్డ పేరు వచ్చిందని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఒక మహిళగా తాను ఇలాంటి వాటిని సహించ బోనని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు. మహిళలు ప్రధానంగా యువతులు మారుతున్న టెక్నాలజీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అవసరమైనంత మేరకే ఫోన్లు వాడాలని ఆ తర్వాత దూరంగా పెట్టాలన్నారు.
Also Read : ఈడీ ముందు హాజరైన డీకే శివకుమార్
I am morally shaken by the ghastly incident at #ChandigarhUniversity. The name of my city is being tarnished due to this institute. I want to clarify that it is based in Kharar, Punjab. My heartfelt concern goes out to the girls & their parents who are a victim of this incident.
— Kirron Kher (@KirronKherBJP) September 18, 2022