Bhagwant Mann : మాన్ మంచోడు మద్యం ముట్టడు – ఆప్
అదంతా ప్రతిపక్షాల కుట్ర
Bhagwant Mann : భగవంత్ మాన్ విదేశీ పర్యటన ముగించుకుని పంజాబ్ కు తిరిగి వచ్చారు. అయితే సీఎం ఫుల్ గా మద్యం సేవించి ఉండడం వల్లనే విమానం నాలుగు గంటలు ఆలస్యమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై క్లారిటీ ఇవ్వాలని, ఇలాంటి తాగుబోతు సీఎం పంజాబ్(Bhagwant Mann) రాష్ట్రానికి ఉండడం బాధాకరమని ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై సీరియస్ గా స్పందించి ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
ఫ్రాంక్ ఫర్డ్ నుండి ఢిల్లీకి ఆలస్యంగా లుఫ్తాన్సా విమానంలో బయలు దేరానని, ఆయన క్షేమంగా ఇక్కడికి చేరుకున్నారని తెలిపింది.
ఒకవేళ మద్యం సేవించి ఉన్నట్లయితే విమానాశ్రయంలోనే బయటకు పంపించి ఉండే వారని ఆ మాత్రం తెలుసు కోకుండా తమ సీఎంపై బుదర చల్లడం అలవాటుగా మారిందని ఆప్ ఆరోపించింది.
ఇది పూర్తిగా నిరాధారమైన వ్యాఖ్యలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్రశ్నిస్తారని నిలదీసింది ఆప్. అనారోగ్యం కారణంగా ఢిల్లీకి రావడంలో కొంత ఆలస్యం జరిగందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఎందుకు విమానం ఆలస్యం అయిందనే దానిపై లుప్తాన్స విమాయానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్ బౌండ్ ఫ్లైట్ , విమానం మార్పు కారణంగా అనుకున్న దాని కంటే ఆలస్యంగా బయలు దేరినట్లు తెలిపింది.
ఈ మొత్తం ప్రకటనను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో విపక్షాలు చేసిన ఆరోపణలు అర్ధరహితమని అర్థమైందని తేలిందని పేర్కొంది ఆప్.
మొత్తంగా ఆప్ వర్సెస్ ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు.
Also Read : వీడియోల లీక్ ఘటన బాధాకరం