Supreme Court : ఇష్ర‌త్ జ‌హా కేసులో స‌తీష్ చంద్ర‌కు ఊర‌ట‌

విచార‌ణ అధికారి తొలగింపుపై విచార‌ణ

Supreme Court : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఇష్ర‌త్ జ‌హాన్ కేసును విచారించిన అధికారిని తొల‌గించ‌డంపై స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది.

సెప్టెంబ‌ర్ 7న కేంద్రం తీసుకున్న చ‌ర్య‌ను ఢిల్లీ హైకోర్టు స‌మ‌ర్థించిన‌ప్ప‌టికీ దాని అమ‌లును సోమ‌వారానికి వాయిదా వేశారు. దీనిపై ఉన్న‌తాధికారి స‌తీష్ చంద్ర వ‌ర్మ అత్యున్న‌త న్యాయ స్థానంలో స‌వాల్ చేశారు.

ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై జ‌స్టిస్ కేఎం జోసెఫ్ , జ‌స్టిస్ హృషి కేష్ రాయ్ ల‌తో కూడిన ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు వ‌ర్మ‌ను తొల‌గించ‌డంపై స్టేను వారం రోజుల పాటు పొడిగించింది.

2011లో ఇష్ర‌త్ జ‌హాన్ టెర్ర‌ర్ మాడ్యూల్ లో భాగ‌మ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌రో ముగ్గురిని చంపేశారంటూ అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు ఇండియ‌న్ పోలీస్ ఆఫీస‌ర్ స‌తీష్ చంద్ర వ‌ర్మ తొల‌గించడంపై స్టే విధించింది.

2004లో అహ్మ‌దాబాద్ స‌మీపంలో ఎన్ కౌంట‌ర్ చేసిన వ‌ర్మ ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు నెల రోజుల ముందు ఆగ‌స్టు 30న కేంద్రం తొల‌గించింది. 7న ఢిల్లీ కోర్టు స‌మ‌ర్థించింది.

దాని అమ‌లును సోమ‌వారానికి వాయిదా వేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడ‌రు వ‌ర్మ‌. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించారు.

ఆర్డ‌ర్ కు వ్య‌తిరేకంగా స‌వాల్ చేసేందుకు ఢిల్లీ కోర్టులో పెండింగ్ లో ఉన్న త‌న పిటిష‌న్ ను స‌వ‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకునేందుకు వ‌ర్మ‌కు అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం ఇక వ‌ర్మ త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ వాదించారు.

Also Read : వీడియోల లీక్ ఘ‌ట‌న బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!