PM Modi : ప్ర‌ణాళిక‌ల త‌యారీతోనే అభివృద్ధి సాధ్యం

పోల్ కేంద్రీకృత విధానంతో సాధ్యం కాదు

PM Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోల్ కేంద్రీకృత విధానంతో న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డం సాధ్యం కాద‌న్నారు.

భార‌తీయ జ‌నతా పార్టీకి చెందిన మేయ‌ర్ల‌కు ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌లు పాటిస్తే న‌గ‌రాల్లో పాత భ‌వ‌నాలు కూలి పోవ‌డం, అగ్ని ప్ర‌మాదాల‌ను నివారించవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఆలోచించ కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ఇదే క్ర‌మంలో న‌గ‌రాల స‌మ‌గ్ర అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాన మంత్రి.

గెలుపొంద‌డం అన్న‌ది ప్ర‌ధానం కాదు. ఎన్నిక‌ల కేంద్రీకృత విధానంతో న‌గ‌రాల‌ను అభివృద్ది చేయ‌డం ఎంత మాత్రం సాధ్యం కాద‌న్నారు.

ఈ విష‌యాన్ని మీరు గుర్తించాల‌ని లేక పోతే ప్ర‌మాదం అని హెచ్చ‌రించారు మోదీ(PM Modi). గుజ‌రాత్ రాజ‌ధాని గాంధీన‌గ‌ర్ లో బీజేపీ మేయ‌ర్ల జాతీయ స‌ద‌స్సును ప్రారంభించారు.

అనంత‌రం ప్ర‌సంగించారు మోదీ. 2014లో భార‌త దేశంలోని వివిధ న‌గ‌రాల్లో మెట్రో రైలు నెట్ వ‌ర్క్ 250 కి.మీ కంటే త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ఇప్పుడు 750 కిలో మీట‌ర్ల‌కు పైగా పెరిగింద‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి. మ‌రో 1,000 కిలోమీట‌ర్ల మేర ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

అయితే ఆయా న‌గ‌రాల‌లో పాత భ‌వాన‌లు కూలి పోవ‌డం , భ‌వ‌నాల‌లో మంట‌లు చెల‌రేగ‌డం అనేది అత్యంత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని ఆవేద‌న చెందారు న‌రేంద్ర మోదీ.

కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ రూపొందించిన రూల్స్ ను పాటించ గ‌లిగితే ఇబ్బందులంటూ ఉండ‌వ‌న్నారు మోదీ.

Also Read : 216 లెవ‌ల్ క్రాసింగ్ లు తొల‌గింపు

Leave A Reply

Your Email Id will not be published!