Narayan Rane : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు జరిమానా
అక్రమ నిర్మాణం, కూల్చి వేతలపై ఆదేశాలు
Narayan Rane : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు కోలుకోలేని షాక్ తగిలింది. అక్రమ నిర్మాణం, కూల్చి వేతలకు కరో్టు ఆదేశాలపై రాణేకు జరిమానా విధించింది.
రెండు వారాల వ్యవధిలో అనధికార భాగాలను కూల్చి వేసి ఒక వారం తర్వాత కోర్టుకు సమ్మతి నివేదికను సమర్పించాలని కోర్టు బృహన్ ముంబై కార్పొరేషన్ ను ఆదేశించింది.
మహారాష్ట్రలోని జుహూ లోని నారాయణ్ రాణే(Narayan Rane) బంగ్లాను కూల్చి వేయాలని హైకోర్టు పౌర సంఘాన్ని కోరింది.
మంత్రికి సంబంధించిన అనధికార నిర్మాణాన్ని (ఎఫ్ఎస్ఐ) , కోస్టల్ రెగ్యులేషణ్ జోన్ (సీఆర్ జెడ్ ) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ దాన్ని కూల్చి వేయాలని ముంబై పౌర సరఫరాల సంస్థను బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.
న్యాయమూర్తులు ఆర్ డి ధనుక, కమల్ ఖాటాతో కూడిన డివిజన్ బెంచ్ బృహన్ ముంబై మున్సిపల్కార్పొరేషన్ (బీఎంసీ) అనధికారిక నిర్మాణాన్ని క్రమబద్దీకరించాలని కోరుతూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ రాణే(Narayan Rane) ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.
అలాంటి వ్యక్తం ఆక్రమణకు పాల్పడడమే కాకుండా దానిని క్రమబద్దీకరించాలని కుటుంబీకులు కోరడం దారుణమని పేర్కొంది ధర్మాసనం.
అంతే కాకుండా కేంద్ర మంత్రికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది హైకోర్టు.
Also Read : ప్రణాళికల తయారీతోనే అభివృద్ధి సాధ్యం