CM Ashok Gehlot : రాజస్థాన్ పైనే అశోక్ గెహ్లాట్ ఫోకస్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ
CM Ashok Gehlot : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అధ్యక్ష పదవి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.
ఈనెల 30 దాకా దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. పార్టీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనంటూ కుండ బద్దలు కొట్టారు మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
గాంధీ ఫ్యామీలీకి వీర విధేయుడిగా పేరొందారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. అయితే ఆయన రాహుల్ పార్టీ చీఫ్ కావాలంటూ తీర్మానం చేశారు.
పార్టీకి సంబంధించి ఒక వేళ రాహుల్ గాంధీ ఒప్పుకోక పోతే ఇక బరిలో నిలవాల్సింది అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) . ఇక పార్టీలో ఎంతో మంది సీనీయర్లు ఉన్నా ఆయన వైపు మేడం సోనియా గాంధీ మొగ్గు చూపుతున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇదే క్రమంలో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు.
ఇందుకు సంబంధించి మేడం సోనియా ను కలిశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు గెలుస్తారనే దాని కంటే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
మొత్తం పార్టీ పరంగా 9,000 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే పార్టీ చీఫ్ రేసులో ఉంటారని భావించిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
మొత్తంగా పార్టీ చీఫ్ కంటే రాజస్థాన్ లో చక్రం తిప్పేందుకే అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) ప్రయారిటీ ఇస్తారనేది వాస్తవం. మరి మేడం మాట వింటారా లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : రాహుల్ యాత్రపై పీకే షాకింగ్ కామెంట్స్