Adhir Ranjan Chowdhury : బీజేపీకి టీఎంసీ బి టీమ్ – అధీర్
నిప్పులు చెరిగిన కాంగ్రెస్, సీపీఎం
Adhir Ranjan Chowdhury : భారత దేశం నుంచి వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్లడం వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్ర లేనే లేదంటూ కితాబు ఇచ్చారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamatha Banerjee).
ఇప్పటికే బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ నువ్వా నేనా అన్న రీతిలో పోట్లాడుతున్నాయి. ఇదే క్రమంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి పార్థు ఛటర్టీ,
ఆయన సహాయకురాలు ఆర్పితా ముఖర్జీని అదుపులోకి తీసుకుంది ఈడీ. అంతే కాకుండా రూ. 100 కోట్లకు పైగా స్వాధీనం చేసుకుంది. మరో వైపు పశువుల కుంభకోణంలో మరో టీఎంసీ లీడర్ ను అరెస్ట్ చేసింది.
బొగ్గు కుంభకోణం కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్య, మేన కోడలుకు సమన్లు జారీ చేసింది.
ఇలా వరుసగా టీఎంసీ నేతలకు ఝలక్ ఇస్తూ వస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తునా ఆందోళన చేపట్టింది. అది ఉద్రిక్తంగా మారింది.
కాగా ఉన్నట్టుండి మమతా బెనర్జీ ప్రధాన మంత్రిని పొగడడం ప్రతిపక్షాలను విస్మయానికి గురి చేశాయి. ఆమె మొదటి నుంచీ బీజేపీకి బి – టీమ్ గా ఉంటోందంటూ మండిపడ్డారు అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) .
ఇదిలా ఉండగా దర్యాప్తు సంస్థలన్నీ ప్రధానమంత్రికి కాకుండా అమిత్ షాకు నివేదిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. ఆమె ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్ అంటూ ఎద్దేవా చేసింది సీపీఎం. వారి బంధం బలీయంగా కొన్నేళ్ల పాటు కొనసాగుతూ వస్తోందని ఆరోపించింది.
Also Read : రాజస్థాన్ ఎమ్మెల్యేలకు సీఎం భరోసా