TTD YS Jagan : ఉత్సవాలకు రావాలని జగన్ కు ఆహ్వానం
కలిసి కోరిన టీటీడీ చైర్మన్ వైవీఎస్, ధర్మారెడ్డి
TTD YS Jagan : తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటీ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డి బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని(TTD YS Jagan) మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మ వార్లతో కూడిన చిత్ర పటంతో పాటు స్వామి వారికి చెందిన అమృతంగా భావించే ప్రసాదాన్ని అందజేశారు.
ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్, ఈఓతో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సీఎం జగన్ రెడ్డికి శేష వస్త్రాలు అందజేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై రాష్ట్ర ప్రజల పక్షాన స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని టీటీడీ చైర్మన్, ఈవో, భూమన కోరారు.
ఇందుకు గాను సీఎం జగన్ రెడ్డి వారికి హామీ కూడా ఇచ్చారు. సకుటుంబ సమేతంగా హాజరవుతామని తెలిపారు. ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించ లేదు టీటీడీ(TTD).
ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంలో యధావిధిగా అన్ని సేవలను పునరుద్దరించింది. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.
సిఫారసు లేఖలు నిలిపి వేసినట్లు ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు.
Also Read : ఏపీ దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలు