Gyanvapi Mosque Case : జ్ఞాన వాపి కేసు తీర్పుపై ఉత్కంఠ
తుది విచారణ చేపట్టనున్న తీర్పు
Gyanvapi Mosque Case : యూపీలోని జ్ఞానవాపి కేసుకు సంబంధించి కీలకమైన తీర్పు(Gyanvapi Mosque Case) వెలువడనుంది. ముస్లిం పిటిషనర్లు ప్రధానంగా మసీదు నిర్వాహకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
జ్ఞాన వాపి అనేది అయోధ్య, మధురతో పాటు మూడు ఆలయ మసీదు వరుసలలో ఒకటిగా ఉంది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న వారణాసి లోని జ్ఞాన వాపి మసీదులోని మందరిలో ఏడాది పాటు ప్రార్థనలు చేయాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టుకు ఎక్కారు.
వారు కోరిన మేరకు చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది వారణాసి కోర్టు. కొద్ది రోజుల తర్వాత వారణాసి లోని సీనియర్ న్యాయమూర్తి జ్ఞాన్ వాపి కేసును విచారించనున్నారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12 నాటి తన ఆదేశంలో వారణాసి కోర్టు పిటిషనర్లు మసీదును దేవాలయంగా మార్చమని కోరడం లేదని, కానీ వివాదాస్పద ఆస్తిలో ఏడాది పొడవునా పూజించే హక్కును కోరుతుందని పేర్కొంది.
1991లో చేసిన చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947లో ఉన్న విధంగా ప్రార్థనా స్థలాలను అనుమతించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు. ముస్లిం పిటిషనర్లు చేసిన పిటిషన్ ను తిరస్కరించారు న్యాయమూర్తి.
ఈ దావాకు ఎటువంటి అర్హత లేదని మండిపడ్డారు. మరో వైపు కేసు తదుపరి విచారణకు సిద్దం కావడానికి 8 వారాల గడువు కోరుతూ ఒక దరఖాస్తును దాఖలు చేశారు.
హిందూ మహిళల తరపు న్యాయవాదులు మసీదులో ఆర్కియాలిజకల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తాజా సర్వేను కోరతామని చెప్పారు.
Also Read : పీఎం కేర్స్ ట్రస్టీలుగా టాటా..థామస్..సుధా