Rajendra Guda : సచిన్ పైలట్ ను సీఎం చేస్తే వ్యతిరేకించం
రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గూడా కామెంట్స్
Rajendra Guda : కాంగ్రెస్ పార్టీలో జోడు పదవుల వ్యవహారం సరికొత్త వివాదానికి దారి తీసేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేసింది పార్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మిస్త్రీ.
ఈ తరుణంలో రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ బరిలో ఉండనున్నారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.
మరో వైపు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Sashi Tharoor) సైతం తాను కూడా బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో రాజస్థాన్ కాంగ్రెస్ లో కుర్చీ కోసం పోటీ ఏర్పడింది.
ఇప్పటికే ఒకసారి కోలుకోలేని షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన యువ నాయకుడు సచిన్ పైలట్. కాగా తాను ఎక్కడికీ వెళ్లనని, ఢిల్లీకి వెళ్లినా ఇక్కడే ఉంటానని కుండ బద్దలు కొట్టారు సీఎం అశోక్ గెహ్లాట్.
అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సచిన్ పైలట్. మరో వైపు భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మొదటి నుంచి ఒక నాయకుడు ఒకే పదవికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
దీంతో అటు సీఎంగా ఇటు పార్టీ ప్రెసిడెంట్ గా రెండు పదవులు నిర్వహించేందుకు వీలు పడదు అశోక్ గెహ్లాట్ కు. ఇదిలా ఉండగా రాజస్థాన్ కేబినెట్ లో కొలువు తీరిన మంత్రి రాజేంద్ర గూడా(Rajendra Guda) సంచలన కామెంట్స్ చేశారు.
ఆయన సచిన్ పైలట్(Sachin Pilot) కు మద్దతుగా నిలిచారు. తను సీఎంగా ఎంపికైతే తమకు ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా – గెహ్లాట్