TCS : ఉద్యోగులు వారానికి మూడుసార్లు రావాలి- టీసీఎస్

కోలుకోలేని షాక్ ఇచ్చిన దిగ్గ‌జ ఐటీ కంపెనీ

TCS : ప్ర‌ముఖ భార‌తీయ ఐటీ సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్) సంస్థ కీల‌క నిర్ణ‌యం (TCS) తీసుకుంది. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది.

క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఇంటి నుంచి ప‌ని చేసేందుకు వెసులుబాటు క‌ల్పించింది ఐటీ కంపెనీ. కానీ రాను రాను క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇత‌ర ఐటీ, లాజిస్టిట్ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం కు మంగ‌ళం పాడుతున్నాయి.

ఇందులో భాగంగా శుక్ర‌వారం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా టీసీఎస్ లో ప‌ని చేస్తున్న ఉద్యోగులంతా వారానికి మూడుసార్లు త‌మ త‌మ ప‌రిధిలో ప‌ని చేస్తున్న కార్యాల‌యాల‌కు రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు ఇవాళ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆఫీసుల నుంచి ప‌ని చేయాల్సిందేనంటూ పేర్కొంది. ఈ రూల్స్ ను అతిక్ర‌మిస్తే తొల‌గిస్తామంటూ కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌క‌టించిన వ‌ర్క్ ఫ్రం హోమ్ ఫార్మాట్ ను పూర్తిగా తొలిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో మ‌రిన్ని ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ కంపెనీలు హైబ్రిడ్ మోడ‌ల్ గా మారుతున్నాయి.

ఇందులో భాగంగా టీసీఎస్ త‌న ఉద్యోగులకు ఈ మెయిల్ లో స‌మాచారాన్ని చేర వేసింది. సీనియ‌ర్ ఉద్యోగులు ఇప్ప‌టికే ఆఫీసుల నుండి ప‌ని చేస్తున్నార‌ని , వినియోగదారులు టీసీఎస్(TCS) కార్యాల‌యాల‌ను కూడా సంద‌ర్శిస్తున్నార‌ని తెలిపింది.

మేనేజ‌ర్లు రోస్ట‌ర్ ను సిద్దం చ‌స్తార‌ని ఉద్యోగులు ఆఫీసుల‌కు రావాల్సిందేన‌ని మ‌రోసారి పేర్కొంది. ప్ర‌తిదీ ట్రాక్ చేయ‌బ‌డుతుంద‌ని , ఎవ‌రు పాటించ‌క పోయినా చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది.

Also Read : మోదీ సంక్షోభ నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!