Akhilesh Yadav : గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన అఖిలేష్ యాద‌వ్

ఆజంఖాన్ పై పోలీసు వేధింపులు ఆపండి

Akhilesh Yadav : స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) శుక్ర‌వారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ను క‌లుసుకున్నారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యేల బృందం కూడా ఉంది.

త‌మ పార్టీకి చెందిన ఆజం ఖాన్ పై పోలీసులు, ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు ధోర‌ణికి పాల్ప‌డుతోందంటూ ఆరోపించారు. రాజ్ భ‌వ‌న్ లో కొంత సేపు గ‌వ‌ర్న‌ర్ తో ముచ్చ‌టించారు.

ఈ సంద‌ర్భంగా కావాల‌ని ఇలా చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న మీరైనా సీఎం యోగి ఆదిత్యానాథ్ కు చెప్పాల‌ని కోరారు.

ఆజం ఖాన్ పై యోగి స‌ర్కార్ కావాల‌ని తప్పుడు కేసులు బ‌నాయిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌తి రోజూ ఆయ‌న‌ను మాన‌సికంగా, శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav).

గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ ను క‌లిసి విన‌తిప‌త్రం కూడా ఇచ్చారు పార్టీ చీఫ్‌. ఆజం ఖాన్ కు జ‌రుగుతున్న అన్యాయం గురించి గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించాం. ఫేక్ కేసుల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని కూడా కోరామ‌న్నారు అఖిలేష్ యాద‌వ్.

గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన అనంత‌రం ఎస్పీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఆయ‌నకు ఆరోగ్యం బాగో లేదు. క‌రోనా సోకింది. జైలులోనే ఉండాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు.

త‌మ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని ప‌టేల్ ను కోరిన‌ట్లు చెప్పారు అఖిలేష్ యాద‌వ్.

ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయ‌డంతో ఈ ఏడాది ప్రారంభంలో సీతాపూర్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు ఆజం ఖాన్. అవినీతి, దొంగ‌త‌నంతో స‌హా దాదాపు 90 కేసుల‌ను ఎదుర్కొంటున్నారు.

Also Read : కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా – గెహ్లాట్

Leave A Reply

Your Email Id will not be published!