Amit Shah : పార్టీ మారితే నితీశ్ ప్ర‌ధాని అవుతారా – అమిత్ షా

నిప్పులు చెరిగిన కేంద్ర హోం శాఖ మంత్రి

Amit Shah :  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు.

రాష్ట్రంలో 17 ఏళ్ల పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు నితీశ్ కుమార్. ఈ స‌మ‌యంలో పార్టీ మారినంత మాత్రాన సీఎం ప్ర‌ధాన‌మంత్రి అవుతారా అని ప్ర‌శ్నించారు అమిత్ షా(Amit Shah).

శుక్ర‌వారం బీహార్ లో ప‌ర్య‌టించిన ఆయ‌న భారీ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్ర ఎన్నిక‌ల్లో బీజేపీ – జేడీయూ కూట‌మికి ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించారు.

కానీ అధికారం కోసం ఆయ‌న మిత్ర ధ‌ర్మాన్ని కాద‌ని మోసానికి పాల్ప‌డ్డారంటూ ధ్వ‌జ‌మెత్తారు అమిత్ షా. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ , ఇత‌ర పార్టీల‌తో క‌లిసి కొత్త‌గా మ‌హా ఘ‌ట్ బంధ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేశారు.

నితీశ్ కుమార్ కు ప‌వ‌ర్ కావాలి. ప్రజా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వ‌ని ఎద్దేవా చేశారు అమిత్ షా(Amit Shah). త‌మ‌తో అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు ఉన్నార‌ని ఆ త‌ర్వాత త‌నంత‌కు తానుగా వెళ్లి పోయారంటూ మండిప‌డ్డారు.

అయినా నితీశ్ కుమార్ చేసిన మోసాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. ఇక్క‌డ ఉన్న జ‌నం సాక్షిగా సీఎం నితీశ్ కుమార్ ను, మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ల‌ను హెచ్చ‌రిస్తున్నా. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జంగిల్ రాజ్ న‌డుస్తోంద‌న్నారు.

నితీష్ లాలూ ద్వ‌యం మోసం బ‌ట్ట బ‌య‌లు అయ్యింద‌న్నారు అమిత్ షా. సీఎం ప‌ద‌వి కోసం ఒప్పందాన్ని కాద‌నుకున్న వ్య‌క్తి ఈ దేశానికి ప్ర‌ధాన మంత్రి ఎలా కాగ‌ల‌రో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. ఒక ర‌కంగా నితీశ్ కుమార్ కు అంత సీన్ లేద‌న్నారు అమిత్ చంద్ర షా.

Also Read : కుటుంబ పార్టీల‌పై బీజేపీ పోరాటం – జేపీ న‌డ్డా

Leave A Reply

Your Email Id will not be published!