CM YS Jagan : వ‌చ్చే ఏడాది నుంచే రూ. 2,750 పింఛ‌న్

కుప్పంలో ప్ర‌క‌టించిన ఏపీ సీఎం జ‌గ‌న్

CM YS Jagan : ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీపిక‌బురు చెప్పారు ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan). వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి నుంచి ప్ర‌స్తుతం ఇస్తున్న పెన్ష‌న్ ను రూ. 2,750కి పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గ‌త ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు. కానీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను తుచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం వ‌యో వృద్దులకు ఇస్తున్న ఫించ‌న్ రూ. 2,500 నుంచి మ‌రో రూ. 250 అద‌నంగా పెంచేందుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ఏ ఒక్క‌రు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకే పెన్ష‌న్ ను పెంచిన‌ట్లు చెప్పారు జ‌గ‌న్ రెడ్డి.

విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, టెక్నాల‌జీ, లాజిస్టిక్, త‌దిత‌ర రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో రూ. 3,000 చొప్పున పెన్ష‌న్ ఇస్తామ‌ని హామీ ఇచ్చామ‌ని కానీ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా ప్ర‌స్తుతానికి కొంత మొత్తం మాత్ర‌మే పెంచామ‌ని త్వ‌ర‌లో దానిని కూడా పూర్తి చేస్తామ‌ని చెప్పారు సీఎం(CM YS Jagan).

రాష్ట్రంలో ప్ర‌ధానంగా తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌లు త‌మ కుటుంబాల‌ను న‌డిపించేందుకు సాధికార‌త‌ను సాధించేందుకు వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కం తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు సీఎం.

ఈ ప‌థ‌కం కింద వ‌రుస‌గా మూడోసారి 26.39 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు రూ. 4,949.44 కోట్ల‌ను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేర్చామ‌న్నారు. గ‌డిచిన మూడేళ్ల‌లో రూ. 14,110.62 కోట్లు ఇచ్చామ‌న్నారు. అమ్మ ఒడి కంద రూ. 19,617 కోట్లు పంపిణీ చేశామ‌న్నారు.

Also Read : కేంద్ర విద్యుత్ బిల్లు ఎవ‌రి కోసం

Leave A Reply

Your Email Id will not be published!