NCPCR Delhi Govt : ఢిల్లీ బడుల్లో డ్రాపవుట్స్ అధికం – ఎన్సీపీసీఆర్
ప్రిన్సపల్ ఖాళీలు కూడా అత్యధికమని వెల్లడి
NCPCR Delhi Govt : విద్యా పరంగా దేశానికే తాము రోల్ మోడల్ అంటూ ప్రకటిస్తూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
ఢిల్లీ రాష్ట్ర నిర్వహణలోని పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని, దీంతో పాటు ప్రిన్సిపల్ ఖాళీలు భారీగా ఉన్నాయని వెల్లడించింది అపెక్స్ బాలల హక్కుల సంస్థ (ఎన్సీపీసీఆర్)(NCPCR Delhi Govt).
ఈ మేరకు శనివారం ప్రకటించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బడి బయట పిల్లలపై బాలల హక్కుల సంఘం సర్వే చేపట్టింది.
ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీకి ( 5వ తరగతి నుంచి 6వ తరగతి దాకా) 99.86 శాతం, ఎలిమెంటరీ నుంచి సెకండరీ వరకు (8 నుంచి 9వ క్లాసు వరకు) 96.77 శాతంగా నమోదైంది.
ఈ మొత్తం శాతం 2015-16కు సంబంధించి. బాలల హక్కుల సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తన పరిశీలనపై నివేదికను తయారు చేసింది.
తమ ప్రభుత్వ విద్యా నమూనాను అంతర్జాతీయ దినపత్రిక టైమ్ ప్రశంసించిందంటూ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
కానీ తాజాగా ఎన్సీపీసీఆర్(NCPCR) వెల్లడించిన రిపోర్ట్ మాత్రం అందుకు విరుద్దంగా నివేదికలో అంశాలు బయట పెట్టింది. సదరు సంస్థ అధిక సంఖ్యలో ప్రిన్సిపాల్స్ పోస్టులు , విద్యార్థి, టీచర్ల నిష్పత్తి , డ్రాపౌట్ రేటు వంటి లోపాలను ప్రత్యేకంగా ఎత్తి చూపింది.
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తన పరిశీలనలపై విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది.
Also Read : మాజీ ప్రధానిపై నారాయణ మూర్తి కామెంట్స్