CBI Raids : లైంగిక వేధింపులపై సీబీఐ దాడులు
దేశ వ్యాప్తంగా సోదాలు ముమ్మరం
CBI Raids : ఆన్ లైన్ లో చిన్నారులపై లైంగిక వేధింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దేశ వ్యాప్తంగా దాడులు(CBI Raids) చేపట్టంది. ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో దేశంలోని 20 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 56 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.
ఇంటర్ పోల్ షేర్ చేసిన ఇన్ పుట్ ల ఆధారంగా సీబీఐ ఈ ఆపరేషన్ చేపట్టింది. పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్ ను ఆన్ లైన్ లో ప్రసారం చేయడం, పంచు కోవడం పై ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా పలు ప్రదేశాలలో దాడులు చేసింది. ఇంటర్ పోల్ షేర్ చేసిన ఇన్ పుట్ ల ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపింది దర్యాప్తు సంస్థ.
వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల ద్వారా పిల్లల లైంగిక దొపిడీ మెటీరియల్ పోస్ట్ లు , సర్క్యులేషన్ లో పాల్గొన్న వ్యక్తుల గురించి అసలు ఇన్ పుట్ న్యూజిలాండ్ లోని ఇంటర్ పోల్ ద్వారా భాగస్వామ్యం చేయబడంది.
వీటిని సింగపూర్ ద్వారా సీబీఐకి పంపారు. 83 మంది వ్యక్తులపై దేశ వ్యాప్తంగా 56 ప్రదేశాలలో దాడులు (CBI Raids) నిర్వహించింది. అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది.
గత ఏడాది 2021 నవంబర్ లో ఇదే విధమైన ఆపరేషన్ కార్బన్ చేపట్టింది సీబీఐ. ఇదిలా ఉండగా ఇంటర్ పోల్ కు సీబీఐ నోడల్ ఏజెన్సీ కూడా.
ఇది అంతర్జాతీయ బాలల లైంగిక వేధింపుల చిత్రం, వీడియో డేటాబేస్ ను కలిగి ఉంది. ఇది సభ్య దేశాల పరిశోధకులను పిల్లల లైంగిక వేధింపుల కేసులపై డేటాను పంచుకునేందుకు అనుమతి ఇస్తుంది.
Also Read : ఢిల్లీ బడుల్లో డ్రాపవుట్స్ అధికం – ఎన్సీపీసీఆర్