Congress Chief Poll : నామినేష‌న్ ప‌త్రాల సేక‌ర‌ణ షురూ

కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నిక‌పై ఉత్కంఠ

Congress Chief Poll : సుదీర్ఘ రాజకీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌ల(Congress Chief Poll)  ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. సెప్టెంబ‌ర్ 24 నుంచి నామినేష‌న్ల ప‌త్రాలను స్వీక‌రించ‌నున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూన్ మిస్త్రీ.

ఇక పార్టీ ప‌రంగా గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ బ‌రిలో ఉండ‌డం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. సోనియా కుటుంబానికి న‌మ్మ‌క‌స్తుడిగా పేరొందారు.

ప్ర‌స్తుతం గాంధీ ఫ్యామిలీ నుంచి అశోక్ గెహ్లాట్, అస‌మ్మ‌తి వ‌ర్గంగా పేరొందిన జి23 నుంచి తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ బ‌రిలో ఉండ‌నున్నారు.

ఈ ఇద్ద‌రి మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ నెల‌కొన‌నుంది. ఇదే స‌మ‌యంలో క‌మ‌ల్ నాథ్ తో పాటు ప‌లువురు కూడా పోటీ చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా శ‌నివారం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈనెల ఆఖ‌రు వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లు స్వీక‌రిస్తారు. అక్టోబ‌ర్ 1 తుది గ‌డువుగా నిర్ణ‌యించారు ప్రిసైడింగ్ ఆఫీస‌ర్. 8న తుది జాబితా ప్ర‌క‌టిస్తారు. బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల మేర‌కు గుర్తులు కేటాయించ‌నున్నారు.

ఇదే స‌మ‌యంలో పార్టీలో 9,000 మంది స‌భ్యులు ఉన్నారు. ఎక్కువ శాతం సోనియా గాంధీకి విధేయులుగా ఉన్నారు. కొద్ది మంది మాత్ర‌మే వారికి వ్య‌తిరేకంగా ఉన్నారు.

మొత్తంగా అశోక్ గెహ్లాట్ ఎన్నిక దాదాపు ఖాయ‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆయ‌న రాజ‌స్తాన్ సీఎంగా ఉన్నారు. ఒక‌రు ఒక ప‌ద‌విని మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని రూల్ ఉంది. ఇవాళ ఎవ‌రు నామినేష‌న్లు దాఖ‌లు చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : పార్టీ చీఫ్ పార్ట్ టైమ్ గా ఉండకూడ‌దు – చౌహాన్

Leave A Reply

Your Email Id will not be published!