PM Modi : సంకీర్ణ సర్కార్ల వల్లే భారత్ ఇమేజ్ డ్యామేజ్
విపక్షాల కూటముల ప్రభుత్వాలపై మోదీ ఫైర్
PM Modi : అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా భారత దేశానికి సంబంధించిన ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
గత కొంత కాలంగా ఇది కొనసాగుతూ వచ్చిందన్నారు. కాంగ్రెస్ యూపీఏ హయాంలో దేశం తన ప్రతిష్టను పూర్తిగా కోల్పోయిందని మండిపడ్డారు.
శనివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రానికి చెందిన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లోని మండికి వెళ్ల లేక పోయారు.
అక్కడ రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని అంతా భావించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర పార్టీ సన్నాహాలు, ఏర్పాట్లు చేసింది.
కానీ వాతావరణం అనుకూలించక పోవడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు.
వాతావరణం సరిగా లేక పోవడం వల్ల నేను అధికారిక పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందుకు నేను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు మోదీ.
ఒక రకంగా నాకు హిమాచల్ ప్రదేశ్ నాకు రెండో ఇల్లుగా భావిస్తాను. తాను ప్రతిసారి ఈ అవకాశాన్ని కోల్పోవడం తనకు బాధ్యంగా ఉందన్నారు.
అయితే రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని స్వయంగా కలుస్తానని చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా యువకుల ధైర్యాన్ని ప్రశంసించారు.
స్వాతంత్ర పోరాటంలో వారి పాత్రను , కార్గిల్ యుద్దంలో శౌర్యాన్ని ప్రదర్శించారంటూ కొనియాడారు నరేంద్ర మోదీ(PM Modi).
Also Read : మోదీ కామెంట్స్ పై రష్యా స్పందన