Lalu Prasad Yadav : అమిత్ షాకు అంత సీన్ లేదు – లాలూ
నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి
Lalu Prasad Yadav : ఆర్జేడీ ఫౌండర్ , మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బీహార్ లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది.
తన చిరకాల మిత్రుడు సీఎం నితీశ్ కుమార్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నోరు పారేసు కోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడంలో కీలక పాత్ర పోషించే షాకు నితీశ్ కుమార్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న అమిత్ షా ఏం అర్హత ఉందని మాట్లాడతారంటూ ప్రశ్నించారు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav).
ఇదిలా ఉండగా తాను నితీశ్ కుమార్ తో కలిసి త్వరలోనే ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని కలుస్తామని చెప్పారు. కాగా అబద్దాలు చెప్పడంలో అమిత్ షా బాద్ షా అని ఎద్దేవా చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెన్ను పోటు పొడిచి మరోసారి సీఎం కుర్చీపై కూర్చున్న నితీశ్ కుమార్ ఎలా దేశానికి ప్రధాన మంత్రి అవుతాడో దేశ ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah).
దీనిపై సీరియస్ గా స్పందించారు లాలూ ప్రసాద్ యాదవ్. రాష్ట్రంలో రాముని పాలన సాగుతోందని కానీ దేశంలో మోదీ ప్రభుత్వం జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు. అది బీహార్ కేంద్రంగా రాజకీయం ఎలా ఉంటుందో తెలుసుకునేలా చేస్తామన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.
ఇకనైనా అమిత్ షా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Also Read : పాస్‌పోర్టు రెన్యూవల్ లో జాప్యం వద్దు