TTD Brahmotsavam : 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
TTD Brahmotsavam : ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దమైంది. కరోనా మహమ్మారి తీవ్రత కారణంగా రెండేళ్లుగా స్వామి, అమ్మ వార్లకు సంబంధించిన ఉత్సవాలను నిర్వహించ లేక పోయింది టీటీడీ.
కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టింది టీటీడీ(TTD Brahmotsavam). సెప్టెంబర్ 27 మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దివ్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఎప్పటి లాగే సంప్రదాయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) మంగళవారం శ్రీవారి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
రెండు సంవత్సరాల తర్వాత ఉత్సవాలు జరగనుండడంతో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తండోప తండాలుగా తరలి రానున్నట్లు అంచనా వేస్తోంది టీటీడీ. ఇప్పటికే భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉత్సవాలలో స్వామి వారిని వీక్షించాలని, దర్శించు కోవాలని కోరిక.
సోమవారం సెప్టెంబర్ 26న అంకురారప్పణ ఉత్సవంతో చక్రస్నానంతో ప్రారంభం అవుతాయి. వచ్చే నెల అక్టోబర్ 5న ముగుస్తాయి.
భక్తుల రద్దీ అంతకంతకూ పెరగడంతో పోలీసులు, ఎన్సీసీ, ఆక్టోపస్ , టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో సహా 7,000 మంది బలగాలను తిరుమల కొండ గుడిపై మోహరించారు. దీంతో పాటు గరుడ సేవ రోజున తిరుమలలో మరో 2 వేల మందిని ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండగా 1582 వరకు సంవత్సరానికి 12 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇది వార్షిక కార్యక్రమంగా రూపాంతరం చెందింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులలో ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది టీటీడీ.
Also Read : టీటీడీ ఆస్తుల విలువ రూ. 85,705 కోట్లు