Rajasthan Crisis : రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం
సీఎం పదవి కోసం నువ్వా నేనా
Rajasthan Crisis : కాంగ్రెస్ పార్టీ మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి దేశంలో కేవలం రెండే రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఒకటి రాజస్థాన్ రెండు చత్తీస్ గఢ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.
పార్టీకి సంబంధించి ఒకరికి ఒకే పదవికి కట్టుబడి ఉండాలని పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ చీఫ్ గా దాదాపు ఎన్నికైనట్లేనని ఇక సీఎం పదవి వదులు కోవాల్సి వస్తుందని ఆయన అనుయాయులు భావించారు.
తాను ఎక్కడికీ వెళ్లనని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని ఇప్పటికే స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). ఇక సీఎం పదవిపై కన్నేసిన సచిన్ పైలట్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో గెహ్లాట్ విధేయులైన ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం(Rajasthan Crisis) వినిపించారు. తాము ఆయన వెంటే ఉంటామని పైలట్ ను సీఎంగా స్వీకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.
రాజకీయ సంక్షోభానికి తెర తీయడంతో పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుత ఉత్కంఠకు పుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగారు సీనియర్ నాయకులు అజయ్ మాకెన్ , మల్లికార్జున్ ఖర్గే. ఈ ఇద్దరూ ఇప్పుడు జైపూర్ లో మకాం వేశారు.
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరింపులకు దిగడంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. 90 మందికి పైగా శాసనసభ్యులు అశోక్ గెహ్లాట్ కు మద్దతు పలికారు.
ఏం జరుగుతుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా తనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు రాజస్థాన్ సీఎం. అయితే ఆయన అండతోనే ఎమ్మెల్యేలంతా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని పార్టీ భావిస్తోంది.
Also Read : నా చేతుల్లో ఏమీ లేదు – అశోక్ గెహ్లాట్