Covid19 Updates : రోజు రోజుకు క‌రోనా కేసుల పెరుగుద‌ల

తాజాగా 4,129 కేసులు న‌మోదు

Covid19 Updates : నిన్న‌టి నుంచి ఇవాల్టికి చూసుకుంటే కొత్త‌గా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. తాజాగా 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 4,129 కేసులు న‌మోద‌య్యాయి. స్వ‌ల్పంగా కేసులు త‌గ్గ‌డం విశేషం. మ‌రో వైపు కేంద్రం బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని కోరింది.

ఇప్ప‌టికే దేశాన్ని ఉద్ధేశించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కోరారు. ఇక క్రియాశీల కేసులు 43,415 వ‌ద్ద ఉన్నాయి. మొత్తం కేసుల‌లో 0.10 శాతంగా ఉంది. ఈ విష‌యాన్ని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.72 శాతంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో 4,688 రిక‌వ‌రీలు జ‌రిగాయి. మొత్తం క‌రోనా(Covid19 Updates) కార‌ణంగా కోలుకున్న రోగుల సంఖ్య 4,40,00,298కి చేరుకుంది. ఇక దేశంలో రోజు వారీ సానుకూల‌త రేటు 2.51 శాతంగా న‌మోదైంది.

వారానికి 1.61 శాతం సానుకూల‌త రేటును న‌మోదు చేసింది. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో భాగంగా భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ -19 వ్యాక్సిన్ల‌ను ఉచితంగా అందిస్తోంది.

అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రు టీకా వేసుకోవాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసింది. దేశంలో వ్యాక్సిన్ త‌యారీదారులు ఉత్ప‌త్తి చేస్తున్న 75 శాతం వ్యాక్సిన్ల‌ను దేశ వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేస్తోంది కేంద్ర స‌ర్కార్.

ఇంకా చాలా మంది టీకాలకు దూరంగా ఉన్నార‌ని గుర్తించింది కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌. భ‌యాందోళ‌న‌కు గురైన వాళ్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు.

అందుకే గ‌తంలో ఒక‌టి , రెండు డోసులు తీసుకున్న వారు కూడా మూడో డోసు వేసుకోవాల‌ని కోరుతోంది కేంద్రం.

Also Read : అంతా మోసం ఆపై ద‌హ‌నం

Leave A Reply

Your Email Id will not be published!