Archana Gulati : గూగుల్ పాల‌సీ హెడ్ అర్చ‌న గులాటీ గుడ్ బై

కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియాలో వ‌ర్క్

Archana Gulati : గూగుల్ కు భారీ షాక్ త‌గిలింది. టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇండియా పాల‌సీ హెడ్ గా ఉన్న అర్చ‌న గులాటీ(Archana Gulati) గుడ్ బై చెప్పారు. తాను గూగుల్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. గ‌తంలో కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా, త‌దిత‌ర విభాగాల‌లో అర్చ‌నా గులాటీ ప‌ని చేశారు.

ఇదిలా ఉండ‌గా అర్చ‌న గులాటీ కేవ‌లం ఐదు నెల‌ల కింద‌టే ప్ర‌భుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత గూగుల్ లో పాల‌సీ హెడ్ గా చేరారు. గూగుల్ ఇండియా కు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, ప‌బ్లిక్ పాల‌సీ కీల‌కమైన విభాగాల‌కు అధిపతిగా చేరారు. అయితే ఈ ప‌దవికి రాజీనామా చేసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

కాగా అర్చ‌నా గులాటీ ఐఐటీ ఢిల్లీ లో పీహెచ్ డీ చేశారు. ఇండియా గూగుల్ లో చేర‌క ముందు గులాటీ కేంద్ర ప్ర‌భుత్వానికి పాల‌సీపై స‌ల‌హా ఇచ్చే ప్ర‌భుత్వ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ లో జాయింట్ సెక్ర‌ట‌రీ (డిజిట‌ల్ క‌మ్యూనికేష‌న్స్ )గా ఉన్నారు.

ఈ విష‌యంపై వివ‌ర‌ణ కోరేందుకు ప్ర‌య‌త్నించ‌గా అటు అర్చ‌నా గులాటీ(Archana Gulati) కానీ ఇటు గూగుల్ సంస్థ కానీ రాజీనామా విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌లేదు. గూగుల్ భార‌త దేశంలోని యాంటీ ట్ర‌స్ట్ కేసులు, క‌ఠిన‌మైన టెక్ సెక్టార్ రూల్స్ ఎదుర్కొంటున్న స‌మ‌యంలో రాజీనామా చేయ‌డం జ‌రిగింది గులాటీ.

సీసీఐ, స్మార్ట్ టీవీల మార్కెట్ , దానా ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ , దాని యాప్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో వ్యాపార ప్ర‌వ‌ర్త‌న‌ను ప‌రిశీలిస్తోంది.

Also Read : చైనా ఒంట‌రిగా ఫీల‌వుతోంది – అదానీ

Leave A Reply

Your Email Id will not be published!