Jai Shankar : వీసా సమస్యలపై జై శంకర్ ఆందోళన
అమెరికా ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి
Jai Shankar : గతంలో ఎన్నడూ లేని విధంగా భారత దేశం వీసా సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటోందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో ఇప్పటి వరకు వీసాల జారీ, రెన్యూవల్ , స్టూడెంట్స్ , టూరిస్ట్ వీసాలను జారీ చేయడంలో అమెరికా రోజు రోజుకు ఆలస్యం చేస్తోంది.
నాన్చుడు ధోరణితో భారతీయులు నానా తంటాలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య అత్యధికంగా వ్యాపార, వాణిజ్య, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలకు చెందిన లక్షలాది మంది పని చేస్తున్నారు. ప్రతి రోజూ వేలాదిగా రాక పోకలు సాగిస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు జై శంకర్. వెంటనే దీనిని యుద్ద ప్రాతిపదికన పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించింది అమెరికా. కరోనా కారణంగానే వీసాల జారీ ఆలస్యమైదని వెల్లడించింది. ఈ సందర్భంగా భారత దేశం వీసా సవాళ్లను లేవనెత్తుతున్నందున వాటిని వెంటనే పరిష్కరించడే లక్ష్యంగా పెట్టుకుంటామని స్పష్టం చేసింది.
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మాట్లాడుతూ వీసా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. జై శంకర్ (Jai Shankar) ప్రధానంగా వీసా సమస్యలను ప్రస్తావించారని తెలిపారు బ్లింకెన్.
ఇదిలా ఉండగా యుఎస్ కి సందర్శకుల వీసాలను పొందాలని చూస్తున్న భారతీయుల వెయిటింగ్ పీరియడ్ 800 రోజులకు పెరిగింది. ఇక విద్యార్థి మార్పిడి సందర్శకుల వీసాలు, ఇతర వలసేతర వీసాల కోసం వెయిటింగ్ పీరియడ్ 400 రోజులుగా పేర్కొంది యుఎస్ అధికారిక సైట్ లో.
Also Read : ముగ్గురు జైషే ఉగ్రవాదులు ఎన్ కౌంటర్