3 Jaish Terrorists : ముగ్గురు జైషే ఉగ్రవాదులు ఎన్ కౌంటర్
భారత బలగాలు దాడులు ముమ్మరం
3 Jaish Terrorists : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం. ఇప్పటికే దాడులు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు(3 Jaish Terrorists) హతమయ్యారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ – ఎ – మహ్మద్ (జెమ్) తో సంబంధం కలిగి ఉన్నారు.
గత కొంత కాలంగా బలగాలు విస్తృతంగా దాడులు చేపడుతూ వస్తోంది. భారత సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో జరిగిన జంట ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ నివేదికల ఆధారంగా దాడులు చేపట్టింది.
ఈ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్తంగా కార్బన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇదిలా ఉండగా సెర్చ్ ఆపరేషన్ సమయంలో జాయింట్ సెర్చ్ పార్టీ అనుమానాస్పద ప్రదేశానికి చేరుకోవడంతో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
చివరకు ఆత్మ రక్షణ కోసం భారత బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోని బట్ పోరాకు చెందిన మహ్మద్ షఫీ గని, టాకియా గోపాల్ పోరాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ వానీ అలియాస్ యావర్ గా గుర్తించారు.
పోలీసు భద్రతా బలగాలపై దాడులు, పౌర దురాగతాలతో సహా అనేక ఉగ్రవాద నేర కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నారంటూ వెల్లడించారు.
Also Read : ఎన్ఐఏ దాడుల్లో పీఎఫ్ఐ కీలక పత్రాలు స్వాధీనం