YS Jagan TTD : శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాల‌లో సీఎం జ‌గ‌న్

పోటెత్తిన భ‌క్త‌జ‌నం..ప‌ర‌కామ‌ణి భ‌వ‌నం ప్రారంభం

YS Jagan TTD : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. గ‌త రెండేళ్లుగా ఈ ఉత్స‌వాల‌ను టీటీడీ నిర్వ‌హించ లేక పోయింది. క‌రోనా కార‌ణంగా స్వామి వారికి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించక పోవ‌డంతో తిరిగి ఈసారి క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందుకు సంబంధించి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు తిరుమ‌ల‌కు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan TTD) హాజ‌ర‌య్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున స్వామి, అమ్మ‌వార్ల‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. సీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి. అంత‌కు ముందు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో స్వామి వారిని ద‌ర్శించుకున్నారు సీఎం. స్వామి వారికి జ‌గ‌న్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో పూజారులు సీఎం జ‌గ‌న్ కు వేదాశీస్సులు అంద‌జేశారు. పుణ్య క్షేత్రంలో కొత్తగా నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వనాన్ని, గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు ఏపీ సీఎం(CM Jagan). ఇదే క్ర‌మంలో నిర్వ‌హించిన పెద్ద శేష వాహ‌న సేవ‌లో పాల్గొన్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా సీఎం స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఉత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేసింది టీటీడీ. ఇదే స‌మ‌యంలో ఎలాంటి సిఫార‌సు లేఖ‌ల‌ను తాము స్వీక‌రించడం లేదంటూ ప్ర‌క‌టించింది.

Also Read : జ్ఞాన్ వాపి కేసు విచార‌ణ‌18కి వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!