Owaisi : దేశ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది.
ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను సమర్థించడం లేదన్నారు. అయితే నిషేధాన్ని మాత్రం తాను క్షమించ లేనని పేర్కొన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. దేశం నిరంకుశత్వానికి, ఫాసిజానికి దగ్గరవుతోందంటూ ఆరోపించారు ఓవైసీ(Owaisi).
ప్రతి ముస్లిం యువత దేశంలోని ఉపా కింద పీఎఫ్ఐ కరపత్రంతో అరెస్ట్ అవుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించడాన్ని ఓవైసీ ఖండించారు. కానీ తాను వారికి సపోర్ట్ చేయనని తెలిపారు. ఈ రకమైన కఠినతరమైన నిషేధం ప్రమాదకరమన్నారు.
ఇదే సమయంలో కేరళ కాంగ్రెస్ పార్టీ, ఐయుఎంఎల్, పీఎఫ్ఐ నిషేధాన్ని స్వాగతించాయి. ఏ ఇస్లాం మతం లేదా మహ్మద్ ప్రవక్త ఇలా చేయమని చెప్పిందా అని ప్రశ్నించాయి.
ఈ దేశంలో ఏదో రకంగా ముస్లింలు జైలు పాలవుతున్నారు. వారు శిక్షలు అనుభవిస్తున్నారు. కానీ టార్గెట్ గా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.
Also Read : సచిన్..గెహ్లాట్ ఇద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్