Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదు
నిప్పులు చెరిగిన ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదన్నారు ఆ పార్టీ మాజీ చీఫ్, వాయునాడు ఎంపీ రాహుల్ గాంధీ. యాత్ర తమిళనాడులో ప్రారంభమై కేరళలో ముగిసింది. కర్ణాటకలో ప్రవేశించిన జోడో యాత్రకు భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది.
మరో వైపు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు తొలగించడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాల తాకిడితో ఒక రోజు యాత్ర వాయిదా పడింది. ఇవాళ వర్షం పడుతున్నా రాహుల్ గాంధీ(Rahul Gandhi) లెక్క చేయకుండా ముందుకు సాగారు.
కాంగ్రెస్ నాయకుడు బహిరంగ సభ ప్రారంభించిన వెంటనే వర్షం ప్రారంభమైంది. ఆయన వానలో తడుస్తూనే ప్రసంగించారు రాహుల్ గాంధీ. యాత్ర దెబ్బకు కేంద్ర సర్కార్ లో వణుకు ప్రారంభమైందన్నారు.
దేశంలో అవినీతి, అక్రమాలకు మోదీ పాలన మారిందని ధ్వజమెత్తారు. ఎక్కడా లేనంత అవినీతి కర్ణాటకలో నెలకొందని ఆరోపించారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించిన ఘనత ఈ సర్కార్ కు దక్కుతుందన్నారు.
భారతీయ జనతా పార్టీ – ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేస్తున్న ద్వేషం , హింసను అరికట్టడం లక్ష్యంగా చేపట్టిన జోడో యాత్రను ఎవరూ అడ్డుకోలేరన్నారు రాహుల్ గాంధీ.
తుపాను, వర్షాలు, కష్టాలు ఈ యాత్రను ఏవీ ఆపలేవన్నారు రాహుల్ గాంధీ. ఈ దేశంలో హింసను ప్రేరేపిస్తున్న వాళ్లు శాంతిని ప్రబోధించిన గాంధీని స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాషాయ పార్టీలపై మండిపడ్డారు.
కన్యాకుమారి నుంచి ప్రారంమైన ఈ యాత్ర నిరాటంకంగా కాశ్మీర్ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read : బీజేపీపై యుద్దం చేసేందుకే పోటీ – థరూర్