Shashi Tharoor : బీజేపీపై యుద్దం చేసేందుకే పోటీ – థ‌రూర్

కేంద్ర స‌ర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ ఆగ్ర‌హం

Shashi Tharoor : కాంగ్ర‌స్ అధ్య‌క్ష ప‌ద‌వి బ‌రిలో ఉన్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై తాను బ‌రిలో ఉన్నాన‌ని స్పష్టం చేశారు ఎంపీ. ఇదిలా ఉండ‌గా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు మాత్ర‌మే బరిలో ఉన్నారు.

అక్టోబ‌ర్ 17న అధ్య‌క్ష ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈనెల 19న ఎన్నిక ఫ‌లితం వెలువ‌డ‌నుంది. త‌న ప్ర‌త్య‌ర్థి ఖ‌ర్గే ఉన్న‌ప్ప‌టికీ తాను అస‌లైన పోటీదారుగా తాను భావించ‌డం లేద‌న్నారు శ‌శి థ‌రూర్. ఒక‌రినొక‌రం పోటీ ప‌డుతున్నా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుపొందినా తాము బీజేపీతో యుద్దం చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని అన్నారు ఎంపీ.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఎప్పుడైతే మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీరిందో ఆనాటి నుంచి దేశంలో విప‌రీత‌మైన ధోర‌ణులు చోటు చేసుకున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). తాను పార్టీని వ్య‌తిరేకించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జాస్వామ్యయుత పార్టీలో ప్ర‌తి ఒక్క‌రు పోటీ చేయాల‌ని అనుకుంటార‌ని పేర్కొన్నారు. సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వెలువ‌రించే అవ‌కాశం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంద‌న్నారు. త‌మ మ‌ధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ పోటీ చేయ‌డం ఖాయ‌మ‌న్నారు శ‌శి థ‌రూర్.

ఏకాభిప్రాయం క‌లిగి ఉండ‌టం మంచిదే కానీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ద్వేషం మంచిది కాద‌ని ఖ‌ర్గేను ఉద్దేశించి పేర్కొన్నారు ఎంపీ.

Also Read : యువ ర‌చ‌యిత‌ల కోసం ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!