CPWD Invites : పీఎం నివాసం కోసం బిడ్ ల ఆహ్వానం
రూ. 360 కోట్లతో కొత్త భవన సముదాయం
CPWD Invites : ప్రధానమంత్రి కొత్త నివాస సముదాయం కోసం సీపీడబ్ల్యూడీ(CPWD Invites) ప్రీ క్వాలిఫికేషన్ కు సంబంధించి బిడ్ లను ఆహ్వానించింది. ఈ కాంప్లెక్స్ ను రాష్ట్రపతి భవన్ , సౌత్ బ్లాక్ పక్కన సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు.
గత నెలలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (సీపీడబ్ల్యూడీ ) రూ. 360 కోట్ల ప్రధాన మంత్రి నివాస సముదాయం కోసం ప్రీ క్వాలిఫికేషన్ బిడ్ లను ఆహ్వానించింది. ఈ కాంప్లెక్స్ ను రాష్ట్రపతి భవన్ , సౌత్ బ్లాక్ పక్కన సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్వహించే ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్ కు సంబంధించిన పనులు ఇంకా అందజేయలేదు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్థుతో పాటు గెస్ట్ హౌస్ , స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆఫీస్ , సపోర్ట్ స్టాఫ్ క్వార్టర్స్ , సీపీడబ్ల్యూడీ ఆఫీసు, బేస్ మెంట్ పార్కింగ్ లాట్ మొదలైన వాటిని కలిగి ఉంటుంది.
దీంతో పాటు కాంప్లెక్స్ లో నాలుగు ప్రవేశ, నిష్క్రమణ గేట్ లు అలాగే 25 ఉంటాయి. ప్రధానమంత్రి కొత్త నివాసం దారా షికో రోడ్ లో రెండు బ్లాకు లను కలిగి ఉంటుంది.
సైట్ అత్యంత సురక్షితమైన జోన్ లో ఉంది. ప్రతిపాదిత భవనాలు రీన్ ఫోర్న్డ్ సిమెంట్ కాంక్రీట్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ బిల్లిండ్ గా ఉండాలని టెండర్ డాక్యుమెంట్ లో పేర్కొంది.
ప్రీ క్వాలిఫికేషన్ ప్రక్రియలో ఖరారు చేసే నిర్మాణ సంస్థలు, ఫైనాన్షియల్ బిడ్ లలో పాల్గొంటాయి. ప్రీ క్వాలిఫికేషన్ బిడ్ లు అక్టోబర్ 14న తెరుస్తారు.
Also Read : యువ రచయితల కోసం పథకం