Amit Shah : అమిత్ షా టూర్ పై ఉత్కంఠ
కాశ్మీరీ తెగకు ప్రత్యేక హోదా
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా మూడు రోజుల పర్యటనలో జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు.
ఓ వైపు ఎన్ కౌంటర్లు మరో వైపు దాడుల పరంపర కొనసాగుతోంది. అమిత్ షా(Amit Shah) ఆకస్మిక పర్యటనతో కంటి మీద కునుకు లేకుండా పోయింది భద్రతా దళాలకు. ఎక్కడ చూసినా సీఆర్పీఎఫ్ , తదితర భద్రతా బలగాలు మోహరించాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. కాగా అమిత్ షా పర్యటనకు ముందు కాశ్మీరీ తెగకు ప్రత్యేక హోదాపై రగడ కొనసాగుతోంది.
కాశ్మీర్ లోని పహారీ వర్గానికి షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను ప్రకటించనున్నట్లు అంచనా. అమిత్ షా ఈరోజు తర్వాత జమ్మూ చేరుకోనున్నారు.
మంగళ , బుధవారాల్లో రాజౌరి, బారాముల్లాలో ర్యాలీలు చేపట్టనున్నారు. పహారీ వర్గానికి చెందిన వారంతా పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
కాగా పహారీలకు ఎస్టీ హోదా కల్పించే అవకాశం నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ లో రాజకీయ గొడవ, అసమ్మతిని ప్రేరేపించింది. కేంద్ర హోం మమత్రి ర్యాలీలో పాల్గొనాలని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ఎమ్మెల్యే విన్నవించారు.
కమ్యూనిటీ మొదటిది. రాజకీయం తర్వాత. మనమంతా ర్యాలీలో పాల్గొని సమిష్టి బలాన్ని చాటాలని కోరారు. ఇప్పటికైనా ఎస్టీ హోదా సాధించక పోతే ఇంకెప్పుడూ సాధించ లేమన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో పహారీ తెగకు చెందిన వారు వేలాది మంది ఉన్నారు. వారి ప్రధాన డిమాండ్ ఎస్టీ హోదా కావాలని.
Also Read : పీఎం నివాసం కోసం బిడ్ ల ఆహ్వానం