Telegram Founder : వాట్సాప్ కు దూరంగా ఉండండి – డ్యూరోవ్
టెలిగ్రామ్ ను ఉపయోగించండి
Telegram Founder : టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యూరోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ కు దూరంగా ఉండండని సూచించారు. గత 13 సంవత్సరాలుగా వాట్సాప్ ని నిఘా సాధానంగా ఉపయోగిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వాటికి దూరంగా ఉండాలని కోరాడు.
తాము పూర్తి భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వాట్సాప్ వాడడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. దీని వల్ల అత్యంత గోప్యంగా ఉన్న పూర్తి డేటా, వ్యక్తిగత వివరాలన్నీ లీక్ అవుతాయంటూ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా టెలిగ్రామ్ సురక్షితమని, దానిని ఉపయోగించాలని కోరారు పావెల్ డ్యూరోవ్.
తాను కావాలని ఆరోపణలు చేయడం లేదని లేదా తన టెలిగ్రామ్ ను(Telegram Founder) వాడాలని కోరడం లేదన్నారు. కేవలం సెక్యూరిటీ విషయంలోనే ముందస్తుగా హెచ్చరించాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
700 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు , 2 మిలియన్ల రోజూ వారీ సైన్ అప్ లతో టెలిగ్రామ్ కు అదనపు ప్రమోషన్ అవసరం లేదన్నారు పావెల్ డ్యూరోవ్.
మీరంతా మీకు నచ్చిన ఏదైనా మెసేజింగ్ యాప్ ని ఉపయోగించ వచ్చన్నారు. కానీ వాట్సాప్ నుండి దూరంగా ఉండడని సూచించారు టెలిగ్రాఫ్ ఫౌండర్. ఇప్పటి నుంచి నిఘా ఉండడం లేదని గత 13 సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు.
హ్యాకర్లు వాట్సాప్ ను సులభంగా హ్యాక్ చేస్తారన్నారు. వారికి యాప్ యాక్సెస్ ఉంటుందని వెల్లడించారు. వాట్సాప్ ద్వారా మొత్తం డేటాను హ్యాకర్లు సులభంగా దొంగిలించవచ్చన్నారు.
Also Read : త్వరలో ఇ-రూపాయి లాంచ్ – ఆర్బీఐ