Komatireddy Rajgopal Reddy : కాంట్రాక్టు కోసం బీజేపీ తీర్థం
టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు
Komatireddy Rajgopal Reddy : మునుగోడులో రాజకీయం మరింత ముదురుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు. వేడి రాజేస్తున్నారు. ఇప్పటికే ఉప ఎన్నిక నోటిఫికేషన్ డిక్లేర్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy), టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డిలను ఎంపిక చేశాయి. ఇదిలా ఉండగా ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. తాజాగా రూ. 18,000 వేల కోట్ల కాంట్రాక్టు దక్కించు కోవడం వల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది.
కోమటిరెడ్డిపై మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర నాయకులు కూడా నిప్పులు చెరుగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి ఉన్నట్టుండి బీజేపీలోకి జంప్ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. ఆయనకు భారీ ఎత్తున కాంట్రాక్టు దక్కడం వల్లనే జంపింగ్ చేశారంటూ ధ్వజమెత్తారు.
బొగ్గు మైనింగ్ కాంట్రాక్టు తీసుకుని పార్టీ మారారంటూ మండిపడ్డారు. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేస్తూ పార్టీ ప్రతినిధి బృందం చీఫ్ ఎలోక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy). నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.
Also Read : ప్రచారానికి కోమటిరెడ్డి దూరం