Mulayam Singh Yadav : ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు
దేశం కోల్పోయిన రాజకీయ దిగ్గజం
Mulayam Singh Yadav : ప్రముఖ రాజకీయ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. భారత దేశ రాజకీయాలలో ఆయన తనదైన ముద్ర వేశారు. అంతకంటే ఎక్కువగా యూపీలో కీలక పాత్ర పోషించారు.
గత మూడేళ్ల నుంచి ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. గత ఆగస్టు నెలలో ఆరోగ్యం క్షీణించడంతో మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచారని గురుగ్రామ్ లోని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్తను కుమారుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
నా గౌరవనీయమైన తండ్రి, అందరి నాయకుడు ఇక లేరు అంటూ పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ నవంబర్ 22, 1939లో పుట్టారు. అత్యంత సీనియర్ నాయకులలో ఒకరుగా గుర్తింపు పొందారు. సమాజ్ వాది పార్టీ చీఫ్. యూపీలోని అజంగఢ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు ములాయం సింగ్ యాదవ్.
1970ల తర్వాత తీవ్రమైన సామాజిక, రాజకీయ గంభీరమైన కాలంలో యూపీ రాజకీయాలలో తనదైన ముద్ర కనబరిచారు. సోషలిస్టు నాయకుడిగా వెలుగొందారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసిన రాజకీయ ప్లేస్ ను చేజిక్కించుకుని ఓబీసీ నేతగా నిలిచారు. 1989లో 15వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : అంబానీ..అదానీల పట్ల ద్వేషం లేదు