Anil Deshmukh ED : దేశ్ ముఖ్ బెయిల్ పై సుప్రీంకు ఈడీ

రేప‌టికి విచార‌ణ చేప‌డ‌తామ‌న్న సీజేఐ

Anil Deshmukh ED : ఎన్సీపీ నేత‌, మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ఇటీవ‌ల బెయిల్ మంజూరైంది. దీనిని స‌వాల్ చేస్తూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై అనిల్ దేశ్ ముఖ్ ను ఈడీ(Anil Deshmukh ED) మొద‌టిసారి గ‌త ఏడాది 2021 న‌వంబ‌ర్ 2న అరెస్ట్ చేసింది.

ఇంకా ఆయ‌న‌ను విచారించాల్సి ఉంద‌ని , అంత‌లోపే బెయిల్ మంజూరు చేస్తే కేసు ప‌క్క‌దారి ప‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంటూ ఈడీ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. సాలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అత్య‌వ‌స‌ర లిస్టింగ్ అంశాన్ని ప్ర‌స్తావించారు.

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉద‌య్ ఉమేష్ ల‌లిత్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత మ‌ధ్యాహ్నం విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ను కోరారు. దీనిపై మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దాఖ‌లు చేసిన కేసులో ఎన్సీపీ నేత‌కు బాంబే హైకోర్టు గ‌త వారం బెయిల్ మంజూరు చేసింది.

ఈడీ కేసులో అనిల్ దేశ్ ముఖ్ బెయిల్ పొంద‌గా గ‌త ఏడాది ఏప్రిల్ లో అత‌డిపై న‌మోదైన సీబీఐ కేసుకు సంబంధించి క‌స్ట‌డీలో ఉండాల్సి ఉంది. అంత‌కు ముందు విచార‌ణ సంద‌ర్భంగా 72 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న త‌న‌పై కేసు అంచ‌నాల ఆధారంగా ఉంద‌ని హైకోర్టుకు తెలిపారు.

రూ. 100 కోట్లు వ‌సూలు చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేవ‌లం రూ. 170 కోట్ల డ‌బ్బును మాత్ర‌మే ట్రాక్ చేయ‌గ‌లిగింది.

Also Read : సాజిద్ ఖాన్ కు మ‌హిళా క‌మిష‌న్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!