Mohammad Azharuddin : అజారుద్దీన్ పై మరో కేసు నమోదు
హెచ్సీఏ మాజీ చీఫ్, సభ్యుల ఫిర్యాదు
Mohammad Azharuddin : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ , మాజీ ఎంపీ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ చీఫ్ మహమ్మద్ అజారుద్దీన్ పై జి. వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యవర్గంలో పదవీ కాలానికి సంబంధంచి హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది.
సెప్టెంబర్ 26తో హెచ్సీఏ అధ్యక్ష పదవిలో అజారుద్దీన్ ఇంకా కొనసాగుతున్నారంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు జి. వినోద్ , కార్యదర్శి శేషు నారాయణ్ , సభ్యుడు చిట్టి శ్రీధర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
తప్పుడు లేదా కల్పిత పత్రాలను సమర్పించడం ద్వారా అజారుద్దీన్(Mohammad Azharuddin) తన హెచ్ సీ ఏ పదవీ కాలానికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని తప్పుదారి పట్టించారని వారు ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ అంతర్జాతీయ క్రికెటర్ తన పదవీ కాలాన్ని ఏకపక్షంగా పొడిగించాడని ఆరోపించారు.
అంతే కాకుండా అక్టోబర్ 18న ముంబైలో జరగనున్న బీసీసీఐ జనరల్ బాడీ సమావేశానికి హాజరు కానున్నాడని వారు పేర్కొన్నారు. తమ ఫిర్యాదును పరిశీలించి ఐపీసీ రూల్స్ ప్రకారం మహ్మద్ అజారుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కు సంబంధించి మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై విమర్శలు వచ్చాయి. టికెట్ల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read : ఐసీసీ ప్లేయర్ ఆప్ ది మంత్ ‘కౌర్’