Covid19 : కొత్తగా 1,957 కరోనా కేసులు
ఎనిమిది మంది మృతి
Covid19 : గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ మెల మెల్లగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. వెంటనే బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో కొత్తగా 1,957 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ కోవిడ్ -19(Covid19) రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు 219.04 కోట్ల డోస్ ల కరోనా నివారణ వ్యాక్సిన్లను అందించినట్లు తెలిపింది.
కొత్తగా నమోదైన కరోనా కేసులతో కలుపుకుంటే 4,46,16,394 కు చేరుకున్నాయి. క్రియాశీల కేసులు 27,374కి తగ్గాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక చని పోయిన వారు 8 మందితో కలుపుకుంటే ఇప్పటి వరకు దేశంలో 5,28,822కి చేరుకుంది. ఇందులో కేరళ నుంచి ముగ్గురు కరోనా కారణంగా మరణించారు.
మొత్తం ఇన్ ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉండగా జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రోజూ వారీ సానుకూలత రేటు 0.71 శాతం, వారపు అనుకూలత రేటు 1.21 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,40,60,198కి చేరుకోగా కేసు మరణాల సంఖ్య రేటు 1.19 శాతంగా నమోదైంది.
ఇదిలా ఉండగా గత 24 గంటల్లో నమోదైన ఐదు కొత్త మరణాలలో గుజరాత్ , హర్యానా, కర్ణాటక , మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు.
Also Read : దేశాభివృద్దిలో టెక్నాలజీ కీలకం – మోదీ