KTR Modi : మోదీ మౌనం దేశానికి ప్రమాదం – కేటీఆర్
మరోసారి నిప్పులు చెరిగిన ఐటీ మంత్రి
KTR Modi : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో అందరికీ బతికేందుకు హక్కుందని కానీ మోదీ కొలువు తీరిన పాలనలో చాలా మంది అభద్రతతో బతుకుతున్నారని(KTR Modi) పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.
వీరి నిర్వాకం వల్ల, సోయి తప్పి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రజల మధ్య భేదాభిప్రాయాలు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, ప్రాంతాలు, మతాల పేరుతో ప్రజలను రాజకీయంగా రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. మోదీ, అమిత్ షా ప్లాన్ ఇక్కడ వర్కవుట్ కాదన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలుగా మారి పోయాయని ఆరోపించారు కేటీఆర్. ప్రధాని(PM Modi) మౌనాన్ని ఎండగట్టారు. ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎంపీలు మాట్లాడుతుంటే ఎందుకు పలకడం లేదంటూ ప్రశ్నించారు. ఓ వర్గాన్ని పూర్తిగా నిషేధించాలంటూ ఎంపీ వర్మ వ్యాఖ్యానించడం దారుణమన్నారు కేటీఆర్.
మరో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే ను దేశ భక్తుడంటూ వర్ణిస్తారని ఇదేం పద్దతి అంటూ నిలదీశారు మంత్రి. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మసీదులు తవ్వి చూడండి అందులో శివలింగాలు బయట పడితే వాటిని ముస్లింలకు అప్పగించండి అంటూ మాట్లాడుతున్నారని ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడ్డారు కేటీఆర్.
భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు ఆమోద యోగ్యంగా ఉందా అని పేర్కొన్నారు కేటీఆర్. మోదీకి చెవులు ఉన్నా పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
Also Read : రాజేంద్ర పాల్ గౌతమ్ విచారణ