Swapan Dasgupta : దేశ భ‌ద్ర‌త‌కు పెను స‌వాల్ – స్వ‌ప‌న్ దాస్

ప్ర‌ధాన‌మంత్రికి సీరియ‌స్ లేఖ

Swapan Dasgupta : కోల్ క‌తా లోని మోమిన్ పూర్ ప్రాంతానికి వెళుతున్న ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్(Swapan Dasgupta) ను నిర్బంధించారు. కొన్ని గంట‌ల అనంత‌రం బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు స్వ‌ప‌న్ దాస్ గుప్తా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేకుండా పోయాయ‌ని ఆరోపించారు.

చోటు చేసుకున్న హింసాకాండ‌పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని కోరారు స్వ‌ప‌న్ దాస్ గుప్తా. ఇదే విష‌యానికి సంబంధించి కేంద్రం బ‌ల‌గాల‌ను మోహ‌రించాల‌ని సూచించారు సువేందు అధికారి.

ప్ర‌ధాని మోదీకి విన్న‌పం. అక్టోబ‌ర్ 9న ఆదివారం చోటు చేసుకున్న ఘ‌ట‌న అత్యంత బాధాక‌రం. కోల్ కతా లోని కిద్ద‌ర్ పూర్ – ఎక్బ‌ల్ పూర్ బెల్ట్ లో హిందూ మైనార్టీల‌పై జ‌రిగిన అకార‌ణ దాడి గురించి మీ దృష్టికి తీసుకు వ‌స్తున్నా. క‌రుడు గ‌ట్టిన హింసోన్మాదులు ప్ర‌త్యేకంగా హిందూవుల‌ను టార్గెట్ చేశారు.

వారికి సంబంధించిన ఆస్తుల‌ను ధ్వంసం చేశారంటూ లేఖ‌లో పోయారు స్వ‌ప‌న్ దాస్ గుప్తా(Swapan Das Gupta). రాష్ట్రంలో కొన‌సాగుతున్న పాల‌న పూర్తిగా భిన్నంగా ఉంద‌న్నారు. ఇక్క‌డ ఎవ‌రికీ భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కేంద్రం గ‌నుక రంగంలోకి దిగ‌క పోతే హిందువులు బ‌తికే ప‌రిస్థితి లేద‌ని పేర్కొన్నారు లేఖ‌లో స్వ‌ప‌న్ దాస్ గుప్తా. రోజు రోజుకు ఇలాగే వ‌దిలి వేస్తే ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారి పోతుంద‌న్న ఆందోళ‌న నెల‌కొంద‌ని పేర్కొన్నారు.

Also Read : ఎమ్మెల్యే సీత‌క్క‌కు డాక్ట‌రేట్ ప్ర‌దానం

Leave A Reply

Your Email Id will not be published!