Mulayam Singh Yadav : లోకాన్ని వీడిన ములాయం సింగ్ యాదవ్
అశేష జనం అశ్రుతర్పణం
Mulayam Singh Yadav : అశేష జనంతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వారంతా ములాయం సింగ్ యాదవ్ కు తుది వీడ్కోలు పలికారు. 82 ఏళ్ల ఈ సోషలిస్టు నాయకుడికి కన్నీళ్లతో అమర్ రహే అంటూ నినాదాలతో నిండి పోయాయి. 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా మాజీ కేంద్ర మంత్రిగా, మూడు సార్లు మాజీ సీఎంగా కొలువు తీరిన ఈ సోషలిష్టు యోధుడు సోమవారం తుది శ్వాస విడిచారు.
ఆయనకు గౌరవ సూచకంగా యూపీ బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ లోని ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) స్వస్థలం సైఫాయ్ లో జరిగాయి. ఆయనను అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అంతా ప్రేమగా నేతాజీ అని పిలుచుకుంటారు.
కుమారుడు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తన తండ్రి చితికి నిప్పంటించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ తో సహా పలువురు నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పాల్గొన్నారు.
నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. వీరితో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూపీ డిప్యూటీ సీఎంలు బ్రజేష్ పాఠక్ , కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా హాజరయ్యారు.
Also Read : నాపై బురద చల్లితే జనం నమ్మరు – మోదీ