TTD : ఆ రెండు రోజుల్లో శ్రీ‌వారి ఆల‌యం మూసివేత

అక్టోబ‌ర్ 25, న‌వంబ‌ర్ 8న సూర్య, చంద్ర‌ గ్ర‌హణం

TTD :  కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడి ఆల‌యాన్ని మూసి వేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 25న సూర్య గ్ర‌హ‌ణం ఉండ‌డం, వ‌చ్చే న‌వంబ‌ర్ 8న చంద్ర గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌డంతో శ్రీ‌వారి ఆల‌యాన్ని 12 గంట‌ల పాటు మూసి ఉంచుతారు.

శ్రీ‌వారి ఆల‌యంతో పాటు దేశ వ్యాప్తంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) (TTD) ఆధ్వ‌ర్యంలో న‌డిచే 60 ఇత‌ర ఆల‌యాల‌ను సైతం మూసి వేస్తారు. ఈ రోజుల్లో సూర్య‌గ్ర‌హణం, చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ఎలాంటి పూజ‌లు ఉండ‌వ‌ని టీటీడీ తెలిపింది.

25న సూర్య గ్ర‌హ‌ణం కార‌ణంగా స్వామి వారికి సంప్రోక్ష‌ణ చేస్తారు. ఆ రోజున భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌రు. ఇక న‌వంబ‌ర్ 8న వ‌చ్చే చంద్ర గ్ర‌హ‌ణం రోజున కూడా ఎలాంటి పూజ‌లు చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు.

అక్టోబ‌ర్ 25న సూర్య గ్ర‌హ‌ణం కార‌ణంగా ఉద‌యం 8.11 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల ఆల‌య ద్వారా మూసి ఉంటుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

సూర్య గ్ర‌హ‌ణం అనంత‌రం భ‌క్తుల‌ను శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు అనుమ‌తి ఇస్తారు. అలాగే చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా తిరుమ‌ల కొండ గుడి త‌లుపులు ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల వ‌ర‌కు మూసి వేస్తారు.

ఇదిలా ఉండ‌గా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం , శ్రీ‌వాణి ట్ర‌స్ట్ లింక్డ్ వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం స‌హా క‌ళ్యాణోత్స‌వం ఆచారం, రూ. 300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం , ఇత‌ర అన్ని ర‌కాల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు నిలిపి వేస్తారు ఆ రెండు రోజుల్లో.

Also Read : 15 లోగా భూసార ప‌రీక్ష‌లు పూర్తి చేయాలి – జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!