AP CM YS Jagan : 15 లోగా భూసార పరీక్షలు పూర్తి చేయాలి – జగన్
వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశం
AP CM YS Jagan : ఖరీఫ్ సీజన్ లోపు రాష్ట్రంలో భూసార పరీక్షలు పూర్తి చేయాలని ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ఆదేశించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఊరుకునేది లేదన్నారు. తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. రైతులకు మేలు చేకూర్చేందుకు భూసార పరీక్షలు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.
ఈ టెస్టులు చేయడం వల్ల ఎలాంటి పంటలు వేయాలో తెలుస్తుందన్నారు. అక్టోబర్ 15 లోగా ఈ క్రాపింగ్ విధానంలో అథెంటికేషన్ పూర్తి చేసి రైతులకు ఫిజికల్, డిజిటల్ రశీదులను అందజేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు సీఎం.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్బీకే సెంటర్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సామాజిక తనిఖీని కూడా నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి 1.15 కోట్ల ఎకరాల్లో వరి పంటల సాగు పూర్తవుతుందన్నారు.
వచ్చే రబీ సీజన్ లో 57.31 లక్షల ఎకరాలకు 96 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాలు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు సీఎం. రైతులకు సరైన సమయంలో గన్నీ బ్యాగులతో సహా అన్ని మెటీరియల్ లను సరఫరా చేయడంతో పాటు లాజిస్టిక్ మద్దతు అందించాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను సరైన సమయంలో విక్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు సీఎం. రాష్ట్రంలో వరి బాగా సాగవుతోంది. ఎగుమతి కంపెనీలతో చర్చించి బియ్యాన్ని ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్ రెడ్డి.
Also Read : ఇక ‘విజయ సాయి’ ఛానల్..పేపర్