Krishna Srinivasan : ఆర్థిక వృద్దిలో భారత్ బెటర్ – ఐఎంఎఫ్
ప్రస్తుతం ఇతర దేశాల కంటే మేలు
Krishna Srinivasan : భారత దేశానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి ) – ఐఎంఎఫ్. ఆర్థిక రంగానికి సంబంధించి కరోనా తర్వాత ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే భారత్ మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతోందని కితాబు ఇచ్చింది. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ ఆసియా , పసిఫిక్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్(Krishna Srinivasan) వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది 2022కి సంబంధించి భారత దేశం 6.8 శాతం వృద్ది రేటును సాధిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రకాశవంతమైన స్థానంలో ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వృద్ది మందగిస్తోందని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1/3 వంతు ఉన్న దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని హెచ్చరించారు కృష్ణ శ్రీనివాసన్.
ప్రతి దేశం ఆర్థిక మందగమనంలో చిక్కుకుంది. ఈ సందర్భంలో భారత దేశం కొంత మెరుగ్గా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే కొంచెం మేలు అని పేర్కొన్నారు ఐఎంఎఫ్ డైరెక్టర్. వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ లో 2022లో 6.8 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తే ఇదే వృద్ధి రేటు 2021లో 8.7 శాతంగా ఉంది.
ఇక 2023కి సంబంధించిన అంచనా మరింత తగ్గి 6.1 శాతానికి పడి పోయిందన్నారు కృష్ణ శ్రీనివాసన్(Krishna Srinivasan). యుఎస్ , యూరోపియన్ యూనియన్ , చైనా కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్దం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటూ హెచ్చరించారు.
Also Read : జియో..ఎయిర్ టెల్ 5జీ సేవలు షురూ