INDW vs THW Asia Cup 2022 : ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు భార‌త్

అమ్మాయిలు అదుర్స్..సూప‌ర్

INDW vs THW Asia Cup 2022 : మెగా టోర్నీలలో భార‌త పురుషుల జ‌ట్టు నిష్క్ర‌మిస్తుంటే మ‌హిళ‌లు మాత్రం దుమ్ము రేపుతున్నారు. తాజాగా మ‌హిళ‌ల ఆసియా క‌ప్ -2022లో భాగంగా జ‌రిగిన మొద‌టి సెమీ ఫైన‌ల్ లో థాయ్ లాండ్ ను ఓడించి ఫైన‌ల్ కు చేరింది టీమిండియా(INDW vs THW Asia Cup 2022). హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో ఒక్క పాకిస్తాన్ తో మాత్ర‌మే ఓట‌మి పొందింది.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 74 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. గురువారం సిల్హెట్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పూర్తిగా ఆట ఏక‌ప‌క్షంగా సాగింది. థాయ్ లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బార‌త జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 148 ప‌రుగులు చేసింది.

అనంత‌రం 149 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగింది మ‌హిళా థాయ్ లాండ్ టీం. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 74 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. థాయ్ లాండ్ త‌ర‌పున కెప్టెన్ న‌రుఎమోల్ చైవై , న‌ట్ట‌య బూచ‌తం చెరో 21 ప‌రుగులు చేశారు. ఇక భార‌త జ‌ట్టు త‌ర‌పున దీప్తి శ‌ర్మ అద్భుత‌మైన బౌలింగ్ చేసి క‌ట్ట‌డి చేసింది.

కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఇక భార‌త జ‌ట్టు ప‌రంగా చూస్తే ష‌ఫాలీ వ‌ర్మ దంచి కొట్టింది. 42 ప‌రుగులు చేసింది. ఇక కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 36 ప‌రుగులు చేస్తే జెమిమా రోడ్రిగ్స్ 27 ర‌న్స్ తో ఆక‌ట్టుకుంది. ఇక థాయ్ లాండ్ త‌ర‌పున సోర్నారిన్ టిప్పోచ్ 24 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది.

Also Read : బిన్నీ రాక‌తో బీసీసీఐకి మంచి రోజులు

Leave A Reply

Your Email Id will not be published!